Monday, January 20, 2025

‘మెగా 156’ షురూ

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మెగా 156 త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌లో విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాణంలో బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మాగ్నమ్ ఓపస్ మొత్తం యూనిట్, కొంతమంది అతిథులు సమక్షంలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేయగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఇక మేకర్స్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న సినిమా మ్యూజిక్ రికార్డింగ్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివి వినాయక్, మారుతి, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News