Sunday, December 22, 2024

‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వశిష్ట దర్శకత్వంలో ప్రకటించిన మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 157’ అభిమానుల మెగా సెలబ్రేషన్స్‌ను రెట్టింపు చేసింది. పంచభూతాలతో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఆదివారం చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా ప్రీ -ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఛోటా కె. నాయుడు ఈ చిత్రానికి కెమెరామెన్‌గాగా పని చేస్తారని తెలియజేశారు. ‘మెగా 157’ ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించాం. త్వరలో మీ అందరినీ సినిమాటిక్ అడ్వంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము” అని ట్వీట్ చేసిన వశిష్ట మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, డీవోపితో కలసివున్న ఫోటోని షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News