Wednesday, April 2, 2025

‘మెగా 157’ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడితో కలిసి ఒక ఆసక్తికరమైన న్యూ ఎంటర్‌టైనర్ కోసం చేతులు కలిపారు. 8 చిత్రాలకు 8 బ్లాక్ బస్టర్లతో అద్భుతమైన విజయ పరంపరను కొనసాగించిన అనిల్ రావిపూడి.. లేటెస్ట్ రిలీజ్ సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, రికార్డులను బద్దలు కొట్టి, 300 కోట్ల గ్రాస్‌ను దాటింది. మోస్ట్ ఎవైటెడ్ ‘మెగా 157’ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల గోల్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది పండుగ సందర్భంగా అధికారికంగా పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. ఇది చిత్రానికి గొప్ప ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగ వంశీ, యువి క్రియేషన్స్ విక్రమ్, దర్శకుడు వశిష్ట, శ్రీకాంత్ ఓదెల, బాబీ, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, మైత్రి నవీన్, రవి, శిరీష్, అశ్విని దత్, రామ్ ఆచంట, శరత్ మరార్, విజయేంద్ర ప్రసాద్, కెఎస్ రామారావు, కెఎల్ నారాయణ, సురేష్ బాబు, వెంకట సతీష్ కిలారు, జెమిని కిరణ్, చుక్కపల్లి అవినాష్, జెమిని కిరణ్, నిమ్మ కాయల ప్రసాద్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమాలో చిరంజీవిని ఫ్రెష్ అండ్ డైనమిక్ అవతార్‌లో చూపించే అద్భుతమైన స్క్రీన్‌ప్లేని స్వయంగా రాశారు అనిల్ రావిపూడి. నవ్వులు, భావోద్వేగాలను మిళితం చేసి మరచిపోలేని, అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ని అందించబోతున్నారు. ఇందులో శంకర్ వరప్రసాద్ అనేది మెగాస్టార్ చిరంజీవి పాత్ర పేరు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News