- Advertisement -
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 250 కోట్లతో మెగా డెయిరీప్లాంట్ ను ఆగష్టు 2023 నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం డెయిరి నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయ డెయిరి చైర్మెన్ సోమా భరత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా పరిశీలించారు. సిఎం చొరవతో పాడి రంగం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నూతన ఔట్ లెట్ల ఏర్పాట్లతో వేలాది మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి తెలిపారు.
- Advertisement -