Wednesday, January 22, 2025

మెగా ఉచిత వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

నర్వ : నవంబర్ తొమ్మిదో తేదీన జిల్లాలోని నర్వ మండలంలో రైతు వేదిక ఆవరణంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎస్‌విఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, మహబూబ్ నగర్ ఎంఆర్‌ఓ, ఎంపిడిఓ, ఎంపీపి, జడ్పీటిసి, ఎంపీటిసి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామపెద్దలు, యువకులు, ఆర్‌ఎంపి, పిఎంపి వారి సహాకారంతో నిర్వహిస్తున్నట్లు నర్వ సర్పంచ్ పెద్దింటి సంధ్య ఆంజనేయులు తెలిపారు. ఈ శిబిరంలో చిన్నపిల్లల వ్యాధి నిపుణులు, స్త్రీవ్యాధి నిపుణులు, కంటి వ్యాధి నిపుణులు, శస్త్ర చికిత్స నిపుణులు, జనరల్ మెడిసిన్, రోగ నిర్ధారణ చేసి వారికి మందులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ చేయించుకునే వారు తమ ఆరోగ్య శ్రీ కార్డు, తెల్ల రేషన్ కార్డు తమ వెంట తీసుకొని రావాలన్నారు. ఈ అవకాశాన్ని నర్వ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News