- Advertisement -
అమరావతి: అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆరోగ్యంపై ఏటా 19 వేల 200 కోట్లు కేటాయిస్తున్నా..ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య భవిష్యత్తును మార్చేందుకు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో నిర్మాణం కోసం కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు.
- Advertisement -