Saturday, December 21, 2024

నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

జగిత్యాల రూరల్: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్షంగా ఆగస్టు 5న మెగా జాబ్, వీసా మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాబ్, వీసా మేళాకు సంబంధించిన పోస్టర్ ఎస్‌పి ఆవిష్కరిచారు.

ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ, విదేశాల్లో పలు ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆగస్టు 5న ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనర్సింహ గార్డెన్‌లో జిల్లా పోలీస్ శాఖ, ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో మెగా జాబ్, వీసా మేళా నిర్వహిస్తామన్నారు.

నిరుద్యోగ యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాకు 100 వరకు ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీలు రానున్నాయని, ఈ మేళా ద్వారా సుమారు 4000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వూలు నిర్వహిస్తారన్నారు.

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్వూల అనంతరం నియామక పత్రాలు అందజేస్తారని, ఉత్సాహవంతులైన యువతీ, యువకులు తమ పూర్తి వివరాలను తమ తమ పోలీస్‌స్టేషన్లలో స్వయంగా సమర్పించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పిలు వెంకటస్వామి, రాజశేఖర్‌రాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News