Tuesday, January 21, 2025

పోలీసుల ఆధ్వర్యంలో 11న మెగా జాబ్‌ మేళా

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న ఉచిత మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నామని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బా రాయుడు తెలిపారు. ఈ జాబ్‌ మేళా గీతాభవన్ చౌరస్తా సమీపంలోని పద్మనాయక కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాబ్‌ మేళా వివరాలను గురువారం కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. 10 తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసి, బీటెక్, ఎంటెక్, ఎంబీఎ, ఎంసీఎ చదివిన అభ్యర్థులు దాదాపు 4 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.

దాదాపు 100పైగా ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వూలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన వారికి కూడా ఇందులో అవకాశాలను కల్పించనున్నామని తెలిపారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆర్‌ఎస్‌ఐలు మహేష్ 9652169877, తిరుపతి 6301955823 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, ప్రతాప్, ఇన్స్‌పెక్టర్లు సీహెచ్ నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానీమియా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News