Thursday, January 23, 2025

ఏప్రిల్ 2న మెగా జాబ్ మేళా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న 17వ మెగా జాబ్ మేళా కూకట్‌పల్లి మెట్రో వై జంక్షన్ సమీపంలోని గ్రౌండ్‌లో జరుగనుంది. ఈ మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను కూకట్‌పల్లి ఎంఎల్‌ఏ మాధవరంకృష్ణారావుతో కలిసి రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్షంగా ఈ జాబ్ మేళా జరుగుతోందని, సుమారు వందకు పైగా పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 17వ మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగవకాశాలను పొందాలన్నారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 35 వేల మంది తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ద్వారా ఉద్యోగాలు పొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కెసిఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కృషి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు లక్షలాది మందికి ఉద్యోగ,ఉపాధి కల్పన లక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇక తెలంగాణ యువజన సర్వీసుల శాఖ టిఎస్ ఎస్‌టిఈపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కీల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వివిధ రంగాలలో యువతీ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు.

ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాల కల్పనలో భాగంగా ట్రాన్ జెండర్లకు , అలాగే చెవిటి, మూగ వారికి కూడా అవకశం కల్పిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన వారు ఈ జాబ్ మేళాకు తమ పేర్లను రిజిస్ట్రర్ చేసుకోవాలని కోరారు. ఈ మెగా జాబ్ మేళా కోసం హెల్ప్ లైన్ నెంబర్ 7097655912, అలాగే అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు 6304250542, 959903463 నెంబర్లను మెగా జాబ్ మేళాలో పాల్గోనే వారు సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News