Monday, December 23, 2024

ఈ నెల 11న మెగా జాబ్ మేళా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె. వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్‌బినగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 11న ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 108 కంపెనీలు, 10 వేలకు పైగా ఉద్యోగాలను ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.

జాబ్ మేళాలో కనీస విద్యార్హత 7 వ తరగతిగా నిర్ణయించారని ఆయన వాసుదేవ రెడ్డి తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన వారికి ప్రారంభ జీతం రూ.15 వేల నుండి గరిష్టంగా రూ లక్ష వరకు ఉంటుందని, ఈ జాబ్ మేళాలో దివ్యాంగులకు కూడా అవకాశాలు కల్పిస్తారని వివరించారు. జాబ్‌మేళా వివరాల కోసం 7286008234, 9505437112, 8247768371 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. మెగా జాబ్‌మేళాలో పాల్గొని జీవితంలో స్థిరపడాలని ఆయన దివ్యాంగులకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News