Thursday, January 23, 2025

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: వచ్చే నెల 4న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ట్రినిటి హైస్కూల్‌లో ఈ మేళాను నిర్వహిస్తున్నామని, ఇందులో 90 కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. అర్హులైన 10వ తరగతి నుంచి అన్ని రకాల విద్యార్హతలతో కూడిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని కోరారు. రిజిస్ట్రేషన్‌కు అదే రోజు ఉదయం 8 గంటలకు తమ జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News