Monday, January 20, 2025

జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళా : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సహకారంతో దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల జి. కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో నైపుణ్యం కలిగి యువత అవసరం పెరిగిందన్నారు. విదేశాలలో సైతం దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. జూబ్ మేళాకు ఎనిమిదో తరగతి నుంచి పిహెచ్‌డి వరకు అర్హతలు ఉన్న యువత తమ విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు.. తమ అనుభవ పత్రాలను తెచ్చుకోవాలని సూచించారు. జాబ్ మేళాను నగర యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 16 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని విస్తరిస్తాం.

వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.- శ్రీనగర్‌లో అనేక రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తున్నాయి. స్థానిక యువతకు నైపుణ్యం లేదు. వారికి శిక్షణ ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జూబ్ మేళాకు -220 సంస్థలు రానున్నాయి. సెక్యూరిటీ ఫోర్స్‌కు బాగా డిమాండ్ ఉన్నది. -హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు కొత్తగా వస్తున్నాయి. వాటిల్లో పనిచేసేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.- జూన్ 3, 4 తేదీల్లో జరిగే జాబ్ మేళాకు వచ్చేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.- కంపెనీల ఉద్యోగాల్లో సెలెక్ట్ చేయకపోతే.. అలాంటి వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ ఇచ్చి మళ్లీ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News