Saturday, December 21, 2024

యువశక్తితో భవ్యమైన భారత్ నిర్మాణం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దేశ యువశక్తితో భవ్యమైన భారత్ నిర్మించేందుకు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలో జరిగిన మెగాజాబ్ మేళా ముగింపు వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళా లో ఉద్యోగాలకు ఎంపికైన 1300 మంది అభ్యర్థులకు రిటైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ & ఫైనాన్స్, ఆటోమోటివ్, ఫార్మా మొదలైన రంగాల నుంచి 220 కంపెనీల ఆఫర్ లెటర్‌లను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ యువశక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. కౌశల్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వ సహకారంతో సౌతిండియాలోనే మొదటి జాబ్ మేళా నిర్వహించామని వెల్లడించారు. యువతలో శక్తి సామర్థ్యాలు అపారంగా ఉన్నాయి. అందుకే వారి శక్తి సామర్థ్యాలకు నైపుణ్యమనే ఆయుధాన్ని అందించడం ద్వారా అద్భుతాలు సాధించే దిశగా మోడీ సర్కారు పనిచేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News