Saturday, November 23, 2024

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్షంతోనే ఐటిటవర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / సిద్దిపేట అర్బన్: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చాలనే లక్షంగా ఐటి టవర్ తెచ్చామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , సీపీ శ్వేత, హస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్, ప్రముఖ ఐటి కంపెనీ ప్రతినిధులతో కలిసి సిద్దిపేట ఐటి టవర్ ప్రారంభం, ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌ఆలోచనతో ఇప్పటికే కరీంనరగ వరంగల్ ,ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటి టవర్ల ద్వారా ఎంతో మంది యువత ఉ ద్యోగాలు పొందినట్లు తెలిపారు. సిద్దిపేటలో సైతం 718 సిటింగ్ కెపా సిటితో నిర్మించిన ఐటి టవర్‌లో ప్రముఖ ఐటి కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషకరంగా ఉందన్నారు.

ఓఎస్‌ఐ డిజిటల్, జోలాన్ టెక్, విసన్ ఇన్పోటెక్, అమిడాయ్, ఎడ్యూటెక్, ఫిక్సిటి టెక్నాలజీస ఇన్నోసోల్ థోరాన్ టెక్నాలజీస్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్ తదితర కంపెనీలు 300 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చనున్నట్లు ఆయా కంపెనీల ప్రతిధులకు వివరించారు. సిద్దిపేటలో ఐటీ టవర్‌లో బాగస్వామ్యమ్యే కంపెనీలకు రెండేళ్ల పాటు ఉచిత నిర్వహణ, అద్దె, విద్యుత్, ఇంటర్‌నెట్ బిల్లు ఖర్చులు భారం లేకుండా చూస్తామన్నారు. హైదరాబాద్ నుంచి అతీ సమీపంలో ఉన్న సిద్దిపేట ఐటి టవర్ ఆ హ్లాదకరమైన వాతావరణంలో రాజీవ్ రహదారాపై ఉందని సమీపంలో త్రీ స్టార్ హోటల్, అర్బన్ ఫారెస్టు పార్కులు, పోలీస్ కమిషనరేట్ ఉండటంతో ప టిష్టమైన శాంతి భద్రతల నిర్వహణ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని తెలిపారు.

తమతో కలిసి వచ్చే కంపెనీలకు ఎలాంటి రా యితీలు కావాలన్న ఇచ్చేందుకు ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం సిద్ధ్దమని పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్ధులకు స్ధా నికంగా ఐటి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావాలన్నారు. సిద్ది పేటలో ఐటి టవర్ స్ధానిక యువతకు ప్రాదాన్యం ఉండేలా జూన్ 13న సి ద్దిపేటలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహణకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో సమావేశమై ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. యువత కో లువులకు రాయితీలిచ్చి కంపెనీలను ఆహ్వానించడం పట్ల మంత్రికి ఐటి కం పెనీ ప్రతినిధులు దన్యవాదాలు తెలిపారు. సమీఓలో ఐటి కంపెనీ ప్రతి నిధులు ముత్యం, సతీష్, శ్రీకాంత్, సంపత్, ఆశోక్, రమాకాంత్, రాహుల్, పల్లవి, వసంత్, ఆమృత్, అమరేశ్వర్, చందక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News