- Advertisement -
వరంగల్: వరంగల్‌లో మెగా జాబ్ మేళాను జరుగుతుందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ తెలిపారు. వరంగల్ పట్టణంలో మెగా జాబ్ మేళాను మంత్రులు కొండ సురేఖ, సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ఈ జాబ్‌మేళాలో 60 కంపెనీలు పాల్గొంటాయని, 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడమనేది కష్టమన్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు స్పష్టం చేశారు. జాబ్‌మేళాకు నిరుద్యోగులు ఎక్కువ మంది యువత రావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు యువతులు గాయపడ్డారు. వెంటనే వారిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -