Saturday, December 21, 2024

పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అంతటా 2050 నాటికి పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో మెగా మా స్టర్ పాలసీకి రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యా రు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరి శ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు (నెక్స్ లెవల్ డెవెలప్‌మెంట్) చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి పె ట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండీ పాలసీని అనుసరిస్తుందని సిఎం అన్నారు. పారిశ్రా మిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని, అంతకంతకు విలువ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభు త్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందన్న ఆలోచనలకు భిన్నంగా కొత్త పాలసీని తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు.
అన్ని ప్రాంతాలు హైదరాబాద్ మాదిరిగా
హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కా కుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహా లోనే అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షను సిఎం రేవంత్ వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలన్నది తమ లక్ష్యమన్నారు. నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి ఫలాలు, పెట్టుబడులతోనే గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల సౌభాగ్యం, సంక్షేమం కూడా ముడిపడి ఉంటుందన్నారు. పారిశ్రామికం గా అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమ లు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరిం చాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ పాలసీలో భాగంగా తెలం గాణను మూడు క్లస్టర్‌లుగా విభజించనున్నట్లు ఆయన తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్‌ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ క్లస్టర్‌గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని సిఎం రేవంత్ తెలిపారు. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవెలప్ చేస్తామన్నారు. ఓఆర్‌ఆర్ పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకు ఫార్మా విలేజీని అభివృద్ధి చే స్తామన్నారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా, పరిశ్రమలతో పాటు స్కూల్స్, ఆస్పత్రి, అన్ని మౌలి క సదుపాయాలుండేలా వీటిని అభివృద్ధి చేసే ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందిస్తుందని సిఎం పేర్కొన్నారు.
కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తాం
జహీరాబాద్‌లో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసె సింగ్, స్పోర్ట్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అక్కడ పరిశ్ర మల ఏర్పాటు జరగాలని సిఎం రేవంత్ అన్నారు. రక్షణ రంగం, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్ లో అపారమైన అవకాశాలు న్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కొత్త గా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఎన్ని కలు, రాజకీయాలు, అభివృద్ధి వేరని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి అభిప్రాయపడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదని, అపోహాలు అ వసరం లేదని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని హితవు పలికారు. 24 గంటల పాటు తాను ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందు బాటులో ఉంటానని, తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవా లని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించా రు. తమతోనూ, ప్రభుత్వ ప్రతినిధులు అయిన అధికారులతో మాట్లాడకుండానే తొందరపడి ఒక అభిప్రాయానికో, నిర్ణయానికో రావద్దని సిఎం రేవంత్ సూచించారు.
నిరుద్యోగులను భారంగా భావించడం లేదు
రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నార ని, గత ప్రభుత్వం తరహాలో వారిని తాము భారంగా భా వించటం లేదన్నారు. వారిని పరిశ్రమల అభివృద్ధిలో పాలు పంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని సిఎం రేవం త్ తెలిపారు. యువతీ, యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామన్నారు. స్కిల్ యూని వర్సిటీల్లో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కు కునే సామర్థ్యం వాళ్ల సొంతమవుతుందన్నారు.
గౌలిగూడ – ఫలక్‌నుమా, ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు.. 
గతంలో గచ్చిబౌలి – ఎయిర్ పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు ఉండటం వల్ల వారు ఎక్కువగా సొంత వాహనాలు వాడుతున్నారన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్‌నుమా, ఎల్బీనగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ ను ప్రజలు ఎ క్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని అందుకే ఈ రూట్ చాలా వినియోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తొలిదశలో 55 కిలోమీటర్ల
మూసీ నది పరీవాహక ప్రాంతం
మూసీనది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. రింగ్ రోడ్డు మొత్తం ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నా రు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్‌లతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్‌ల ను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూ సీనది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడా లయిన చార్మినార్, గొల్కొండ, సెవెన్‌టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం స ర్క్యూట్ ను రూపొందిస్తామని, వెంటనే దీనికి సంబంధించి అ ధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పిపిపి మోడల్ పద్ధ తిలో పారిశ్రా మికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీనది పరీవా హక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్‌ఫాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని సిఎం రేవంత్ తెలిపారు.
నగరంలో మరిన్ని డంప్ యార్డులు
హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంపింగ్ యా ర్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డం పు యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు త లెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తానికి జవహర్ నగర్‌లో ఒకే డంప్ యార్డు ఉందని, ప్రతిరోజు సుమారు 8 వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరుతోందని ఆయన తెలిపారు. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చు ట్టు ప్రక్కల ఉండే ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నా రు. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శం షాబాద్, మెదక్ వైపు డంప్ యార్డుల కోసం స్థలాలను పరిశీ లించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏ ర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. చెత్త ద్వారా 15 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టిఎస్‌ఎస్పీడిసిఎల్‌తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమం త్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంత వరకు రీసైకిలింగ్ చే యాలని రేవంత్ అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సిఎం ప్రిన్సిపల్ సె క్రెటరీ శేషాద్రి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సి ఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇం డి యన్ ఇండస్ట్రీ ప్రతినిధులు సి. శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, డా క్టర్ మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సుచిత్రా కె ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్ సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్, వై హ రీష్ చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్ర సాద్ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షైక్ షామి ఉద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News