Monday, January 20, 2025

ఆర్లగూడెంలో మెగా వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

దుమ్ముగూడెం : మండలంలోని ఆర్లగూడెం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో నేషనల్ హూమన్ రైట్స్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి సిపిఐ పార్టీ జిల్లా సమితి కలిసి సంయుక్తంగా మెగా వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. నీరజ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి , డాక్టర్ సబితా రెడ్డిలచే ఆశ్రమ పాఠశాలలో 200 మంది పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, ఐ.రామారావు, పిడిఎం.వసంత్, సీనియర్ అసిస్టెంట్ జి.రమేష్, పిఈటిఎం గంగరాజులు, ఎం వెంకటేష్, టీచర్,సిపిఐ పార్టీ నాయకులు ఆర్లగూడెం ఎంపిటీసి పాయం లలిత, నొముల రామిరెడ్డి, తాటిపూడి రమేష్, కొర్స రమేష్,మాజీ సర్పంచ్, పాయం రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News