Wednesday, September 18, 2024

ఆర్‌ఎఫ్‌సిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ’మట్కా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సిని మా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాఫీగా సాగుతున్నాయి. మేకర్స్ ప్రకటించినట్లుగా చాలా ఆసక్తికరమైన అప్‌డేట్‌లు రాబోతున్నాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News