- Advertisement -
డార్లింగ్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీకావు. రాధేశ్యామ్, ఆదిపురుష్ ల ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన సలార్ సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇండియాలోనే కాకుండా, అమెరికాలోనూ సలార్ వసూళ్లలో దూసుకుపోతోంది.
ఈ సందర్భంగా ప్రభాస్ నూ, సలార్ టీమ్ ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవ్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మైడియర్ దేవా రెబల్ స్టార్ ప్రభాస్.. నీకు అభినందనలు. ఇంత గొప్ప విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ కు కూడా అభినందనలు. పృథ్వీరాజ్, శ్రుతిహాసన్, జగపతిబాబు తదితరులు గొప్పగా నటించారు. వారందరికీ నా అభినందనలు. అలాగే మిగిలిన చిత్ర యూనిట్ కు కూడా అభినందనలు’ అంటూ చిరు పేరుపేరునా కంగ్రాట్స్ చెప్పారు.
- Advertisement -