Thursday, January 23, 2025

డ్రగ్స్‌పై సిఎం రేవంత్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్‌పై సిఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి మెగాస్టార్ మద్దతు అంటూ కాంగ్రెస్ శ్రేణులు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తరుపున మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటనలో నటించారు. ఈ యాడ్ లో డ్రగ్స్ బారిన పడిన ఓ వ్యక్తి కుటుంబం పడే కష్టాలను చక్కగా వివరించారు. అంతేగాక మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం, కొనడం, వినియోగించడం చేస్తే వెంటనే తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరోకు తెలియజేయాలని, 8712671111 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని,

అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. దీనికి కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సమాజ హితం కోసం చిరంజీవి ఎప్పుడు ముందుంటారని, రేవంత్ రెడ్డి ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా తెలంగాణ యువత కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News