Sunday, December 22, 2024

అమెరికాలో మెగాస్టార్, విక్టరీ వెంకటేశ్ హల్ చల్!

- Advertisement -
- Advertisement -

ఇద్దరు టాలీవుడ్ హీరోలు అమెరికాలో హల్  చల్ చేస్తున్నారు. వారెవరనుకుంటున్నారా? ఇంకెవరు… మన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్! అయితే వీళ్లు షూటింగులకోసం అమెరికా వెళ్లారనుకుంటే తప్పులో కాలేసినట్లే! చిరంజీవి, వెంకటేశ్ కుటుంబాలకు ఆప్తుడైన ఎన్ఆర్ఐ కుమార్ కోనేరు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ పెళ్లి వేడుకలో మన ఇద్దరూ హీరోలు సరదాగా గడిపి, అక్కడి అభిమానులను ఆనందంలో ఓలలాడించారు. లాస్ ఏంజెలిస్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు చిరు, వెంకటేశ్ మాత్రమే కాకుండా అల్లు అరవింద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణ, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సెలబ్రిటీలంతా కలసి తీయించుకున్న ఫోటోలను మెగాస్టార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News