Sunday, December 22, 2024

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంపై మెగాస్టార్ ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యుదు వంశీ దర్శకుడు. ఈనెల 9న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంట్. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది” అని అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ “ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది. ఈ చిత్రంలో ఉన్నట్టే నాకు ఓ 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మూవీ చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ప్రతి కుర్రాడికి ఈ కథ నచ్చుతుంది” అని తెలిపారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ “ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్లయినా అద్భుతంగా నటించారు. పదిహేను మంది కొత్త ఆర్టిస్టులను నేను ఇస్తున్నాను అన్న తృప్తి నాకు కలుగుతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ “కాంబినేషన్ చూడకుండా.. కథను చూసి నిహారిక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 11 మంది కుర్రోళ్ల సినిమా ఇది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, నిర్మాత ఫణి, రమేష్, రాజు, ప్రణయ్, అన్వర్ అలీ, కృష్ణకాంత్, సింహాచలం, వెంకట్ సుభాష్, కొండల్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News