Thursday, January 23, 2025

సిఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోమవారం కలిశారు. సాయంత్రం సిఎం రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టాలీవుడ్ నుంచి సిఎం రేవంత్ రెడ్జిని కలిసిన తొలి ప్రముఖుడు చిరంజీవి మాత్రమే. దీంతో వీరిద్దరి భేటీలో చర్చించిన అంశాలపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ తొలిసారిగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చిరంజీవి మాత్రం రేవంత్‌తో నేరుగా భేటీ అయిన తొలి సినీ హీరోగా నిలిచారు.

సోమవారం జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి, చిరంజీవి పలు అంశాలపై చర్చించారు. ఇందులో సినీ, రాజకీయ అంశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు తొలిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం టాలీవుడ్‌లో ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి టాలీవుడ్ తరఫున కూడా అన్ని విధాలా సహకారం అందిస్తామని చిరు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేవంత్ కూడా ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News