Monday, July 8, 2024

‘విశ్వంభర’ డబ్బింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో- ఫాంటసీ ఎంటర్‌టైనర్ ’విశ్వంభర’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుం ది. దాంతో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హనుమాన్‌కి గొప్ప భక్తుడి గా కనిపించనున్నారు.

యాక్షన్ సీక్వెన్స్‌లు అ ద్భుతంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. విశ్వంభర సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. విశ్వంభర సినిమా 2025 జనవరి 10న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News