Sunday, December 22, 2024

హీరో శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన మెగాస్టార్! (వీడియో)

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో శ్రీకాంత్ ను సర్ప్రైజ్ చేశారు. శనివారం శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించి, ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీకాంత్ ఇంట్లోని షో కేస్ లో ఉన్న అవార్డులు, మెమొంటోలను చూస్తూ, అలనాటి జ్ఞాపకాలను చిరు నెమరు వేసుకున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ తో కూడా ఆయన కొద్దిసేపు సంభాషించారు. గతంలో హీరో శ్రీకాంత్, మెగాస్టార్ కలసి శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ మూవీలు చేశారు. తాజాగా చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News