Thursday, January 23, 2025

బిగ్ మూవీలో భాగమైన మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈ సినిమా ‘బ్రహ్మస్త్రం‘ పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నారు. “ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు.. అతనే శివ” అంటూ మెగాస్టార్ వాయిస్‌తో ప్రారంభమయ్యే ట్రైలర్ ఈనెల 15న ఐదు భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ వన్‌ను ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నా మేకర్స్. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

Megastar Chiranjeevi voice over in Brahmastra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News