మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్న సీనియర్ సభ్యులకు నెలకు రూ.6వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. వారికి మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ సదుపాయాలు ఉన్నాయి. ఇది ఈ కష్ట కాల ంలో పెద్ద సాయం. పావలా శ్యామల వంటి సీనియర్ నటీమణి సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి 2 లక్షలు సాయపడిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతులమీదుగా ఈ ఆర్థిక సాయం చేశారు. తాజా సమాచారం మేరకు.. మరోసారి పావల శ్యామల ఉపాధి లేక ఈ కష్టకాలంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి తనని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు. అయితే పావల శ్యామలకు చాలా కాలంగా ‘మా’ తరపున సభ్యత్వ కార్డ్‌ను ఇచ్చి.. ఈసీ కమిటీ సభ్యులు కొంత సాయం చేయాలనుకున్నారు.
అయితే మంగళవారం ఈ సభ్యత్వ కార్డుతో పాటుగా.. మెగాస్టార్ ఆర్థిక విరాళం 1లక్ష 1500 రూ.ల చెక్‌ని ఆమెకు అందించారు. ఇకపై కొత్త సభ్యురాలికి మెంబర్షిప్ కార్డుతో నెలకు 6 వేలు, ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ ఉంటుంది. ఇక ఎవరైనా ఆర్టిస్ట్ అకాలమరణం చెందితే 3 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిసింది. ఈ సందర్భంగా పావల శ్యామల మాట్లాడుతూ “చిరంజీవి అప్పట్లో నాకు 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు మరోసారి 1లక్ష 1500 రూ.ల చెక్ ఇచ్చి& ప్రతి నెలా ఆరు వేల రూపాయల సాయం అందించేందుకు తోడ్పడ్డారు. మనస్ఫూర్తిగా చిరంజీవికి నా ధన్యవాదాలు చెబుతున్నా”అని అన్నారు.