హైదరాబాద్: వినూత్న పరిష్కారాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పునరుత్వాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ-2024ను ఆవిష్కరించారు.ఆ తర్వాత, ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రం స్వతంత్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, తేలియాడే సౌరశక్తి, వ్యర్థాల నుండి శక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారని భట్టి చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని తెలియజేశారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నామని, పంప్డ్ స్టోరేజ్, ఫ్లోటింగ్ విద్యుత్ ప్రోత్సాహానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడులకు సంస్థలతో ఎంవోయూలు ఉన్నాయన్నారు. కాలుష్య రహిత, తక్కువ ధరకు విద్యుదుత్పత్తికి దోహదం చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది: భట్టి
- Advertisement -
- Advertisement -
- Advertisement -