Sunday, December 22, 2024

ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన మేఘా ఆకాశ్‌

- Advertisement -
- Advertisement -

మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడిని పెళ్ళి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. హీరో నితిన్ ‘లై’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన మేఘా ఆకాశ్‌ తన ప్రియుడు సాయి విష్ణును వివాహం చేసుకుంది. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను అశీర్వదించారు.

మేఘా ఆకాశ్ పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణు- మేఘా ఆకాశ్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో తాజాగా ఘనంగా వివాహం చేసుకున్నారు. కాగా.. లై సినిమాతోపాటు ఛల్‌ మోహన్‌ రంగా, రాజ రాజ చోర,డియర్‌ మేఘా వంటి చిత్రాల్లో మేఘా ఆకాశ్‌ నటించి అలరించింది. ప్రస్తుతం మేఘా పలు తెలుగు సినిమాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News