Monday, January 6, 2025

ప్రొడ్యూసర్ గా మారిన మేఘ ఆకాష్ తల్లి

- Advertisement -
- Advertisement -

Megha Akash's mom turned producer for her next

‘డియర్ మేఘ’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మేఘ  ఆకాష్ మరో మంచి లవ్ స్టొరీ సైన్ చేసింది. ఈ చిత్రానికి డియర్ మేఘ దర్శకుడు సుశాంత్ రెడ్డి కథ అందించడం విశేషం.అంతేకాదు నిర్మాణం లో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు. సుశాంత్ రెడ్డి.ఏ & అభిషేక్ కోట నిర్మాణంలో, మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. మేఘ ఆకాష్ హీరొయిన్ గా రూపొందబోతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి
అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకుడు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, “డియర్ మేఘ లాంటి హిట్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ తో మా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం పై చాలా అంచనాలున్నాయి. దర్శకుడు అభిమన్యు బడ్డి పై మాకు చాలా నమ్మకముంది. ముఖ్య నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నాం. షూటింగ్ కూడా అతి త్వరలో మొదలవుతుంది.” అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News