- Advertisement -
థాయిలాండ్ నుంచి బేగంపేటకు చేరుకున్న క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థ థాయ్‌లాండ్ నుంచి క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించింది. క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు థాయిలాండ్ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. రెండోదశలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు IAF ప్రత్యేక విమానం ద్వారా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు హైదరాబాద్‌కు చేరాయి. శుక్రవారం మూడు (3) Cryogenic O2 ట్యాంకర్లను బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి తెలంగాణ ఆరోగ్య శాఖకు అందజేయనున్నారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు. ఒకో ట్యాంకర్ ద్వారా కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉత్పతి అవుతుంది.
- Advertisement -