తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్ 10 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో తిరిగే అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు టీటీడీ ఇప్పటికే ప్రణాళికలు రచించింది. భక్తులకు ఉచిత సేవలందించేందుకు 12 బస్సులను కొండ గుడి వద్ద నడుపుతున్నారు. ఈ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘ఈ విషయంలో ముందుగా ఓలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ సీఎండీ ప్రదీప్ ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇవ్వాలని అభ్యర్థించాను’ అని ఆయన చెప్పారు. ఇప్పుడు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ముందుకు వచ్చి రూ.15 కోట్ల విలువైన 10 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందజేసిందని టీటీడీ చైర్మన్ తెలిపారు. మేఘా కృష్ణా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉచిత బస్సులతో పాటు తిరుమలలో తిరిగే ట్యాక్సీలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని యోచిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టాక్సీ డ్రైవర్లు ఈ ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయలేరు కాబట్టి, బ్యాంకులతో టైఅప్ చేయడం ద్వారా టిటిడి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
టిటిడికి 10 ఎలక్ట్రిక్ బస్సులు విరాళం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -