- Advertisement -
హైదరాబాద్: అసెంబ్లీలో పెట్టాల్సిన కాగ్ రిపోర్టును ముఖ్యమంత్రి కెసిఆర్ పక్కన పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే అత్యంత భారీ కుంభకోణం జరిగిన ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. ఆ లూటీని ఆపే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని వేల కోట్లు లూటీ జరిగిందని నాగం వెల్లడించారు. కర్నాటకలో అవినీతి జరిగిందని జిజెపిని గద్దె దించారన్నారు. ప్రాజెక్టులు, బస్సులు అన్నీ మేఘా కృష్ణారెడ్డికే అప్పగించారని ఆయన పేర్కొన్నారు. మేఘా కృష్ణారెడ్డి తెలంగాణకు క్యాన్సర్ కంటే ప్రమాదకారిగా మారారని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -