Wednesday, January 22, 2025

మేఘాలయ 304 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేఘాలయతో శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ సమరంలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (1), రోహిత్ రాయుడు (0) పెవిలియన్ చేరారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మరో ఓపెనర్ రాహుల్ సింగ్ (9), కెప్టెన్ తిలక్‌వర్మ (10) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి టీమ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే హైదరాబాద్ మరో 29 పరుగులు చేయాలి.

అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రాజ్ బిస్వా (64) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్వరజీత్ డాస్ (31), జస్కిరాత్ (46), కెప్టెన్ కిషన్ (29) పరుగులు చేశారు. చివర్లో ఆకాశ్ చౌదరి 50 (నాటౌట్), దిప్పు సంగ్మా (42) రాణించడంతో మేఘాలయ స్కోరు 304 పరుగులకు చేరింది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు, రోహిత్ రాయుడు మూడు వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News