- Advertisement -
మత్తువదలరా, సూపర్ హిట్ సిరీస్ వికటకవిలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న హీరో నరేష్ అగస్త్య… విపిన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై ఉమా దేవి కోట నిర్మిస్తున్న ఈ మూవీ కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. కూల్, బ్రీజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను తెలియజేశారు. ఈ సినిమాకు ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నరేష్ అగస్త్య చీర్ ఫుల్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. రబియా ఖటూన్ ఛార్మింగ్‌గా కనిపించింది. ఇది లవ్, డ్రీమ్స్, బ్యూటీఫుల్ కథని తెలియజేస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
- Advertisement -