Saturday, November 9, 2024

ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ హాస్పిటల్స్ సిఇఒగా భారతీయ వైద్యురాలు మేఘనా పండిట్

- Advertisement -
- Advertisement -

లండన్ : భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా నియామకమయ్యారు. బ్రిటన్ లో భారీ టీచింగ్ ఆస్పత్రుల్లో ఈ ఆస్పత్రి ఒకటి. పండిట్ ట్రస్ట్ ప్రథమ మహిళా చీఫ్ గానే కాకుండా భారతీయ సంతతికి చెందిన మొదటి శాశ్వత సిఇఒగా గుర్తింపు పొందారు. 2022 జులై నుంచి ఇదే హాస్పిటల్స్ తాత్కాలిక సిఇఒగా పనిచేస్తున్నారు. కఠినమైన పోటీలో ఆమె ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

ఆక్స్‌ఫర్డ్ డీనెరీలో అబ్‌స్టెట్రిక్స్, అండ్ గైనకాలజీలో శిక్షణ పొందిన పండిట్ మిచిగాన్ యూనివర్శిటీ యూరోగైనకాలజీ విజిటింగ్ లెక్చరర్‌గా కూడా పనిచేశారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్‌ల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించారు. దేశవిదేశాల్లో వందలాది డాక్టర్ల బాధ్యతను చేపట్టి క్లినికల్ స్ట్రాటజీ అభివృద్ధికి కృషి చేశారు. వార్విక్ యూనివర్శిటీ గౌరవ ప్రొఫెసర్‌గా, గ్రీన్ టెంప్లీటన్ కాలేజీ అసోసియేట్ సభ్యురాలిగా ఉంటున్నారు. యూనివర్శిటీ సహచరులుతోను, ఆక్స్‌ఫర్డ్ షైర్ హెల్త్‌కేర్ సిస్టమ్ భాగస్వాములతోను కలసి మెలసి అత్యున్నత పరిశోధన, నూతన ఆవిష్కరణల కోసం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News