Friday, November 22, 2024

న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మేఘ్వాల్

- Advertisement -
- Advertisement -
ఆశ్చర్యకరంగా గురువారం రిజిజును లా అండ్ జస్టిస్ పోర్ట్‌ఫోలియో నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మేఘ్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు.

న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్ నుంచి రాజకీయవేత్తగా మారిన అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆశ్చర్యకరమైన రీతిలో ఇదివరకు ఆ శాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును బాధ్యతల నుంచి తప్పించారు. రిజిజుకు భూశాస్త్ర మంత్రిత్వ శాఖను అప్పగించారు. బికనీర్ నుంచి మూడు సార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికైన మేఘ్వాల్ స్వతంత్ర బాధ్యతతో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మూడో వ్యక్తి. పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్న మేఘ్వాల్ నియామకం ఈ ఏడాది చివర్లో జరుగనున్న రాజస్థాన్ ఎన్నికలకన్నా ముందు జరిగింది. ‘అందరికీ సత్వర న్యాయం జరిగేలా చూడటమే నా ప్రాధాన్యత’అని బాధ్యతలు స్వీకరించిన మేఘ్వాల్ విలేకరులతో అన్నారు.

ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఎలాంటి ఘర్షణ లేదన్నారు మేఘ్వాల్. కాగా రిజిజు, మేఘ్వాల్‌ను కలుసుకుని కొత్త బాధ్యతపై శుభాకాంక్షలు తెలిపారు. రిజిజుకు భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఇచ్చారు. గతంలో ఈ శాఖను జితేంద్ర సింగ్ నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News