Monday, December 23, 2024

మతద్వేషం రెచ్చగొట్టేందుకే ‘ది కశ్మీర్ ఫైల్స్’కు బీజేపీ ప్రోత్సాహం..

- Advertisement -
- Advertisement -

జమ్ము: నిర్వాసితులైన కశ్మీర్ హిందువుల దుస్థితిని చిత్రీకరించిన ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ సినిమాను బిజెపి ప్రోత్సహించడం ప్రజల్లో మతద్వేషం రెచ్చగొట్టేందుకే అని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ బుధవారం ఆరోపించారు. కశ్మీర్ లోయ నుంచి ఆనాడు కశ్మీర్ పండిట్ల బహిష్కరణకు దారి తీసిన పరిస్థితిపై దర్యాప్తు జరిపేందకు కమిటీని నియమించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆనాడు కశ్మీర్ లోయలో హత్యలు, పండిట్ల బహిష్కరణకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు కమిటీని ప్రభుత్వం నియమించాలని నేషనల్ కాన్ఫరెన్సు చీఫ్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేసిన మర్నాడు ముఫ్తీ అదేవిధంగా డిమాండ్ చేశారు. ఆ చలన చిత్రాన్ని వీక్షించండి,. కానీ ముస్లింల వైపు ద్వేషం చూపవద్దని ఆమె ప్రజలకు సూచించారు. 2020 నాటి ఢిల్లీ అల్లర్లు, 2002 లో గుజరాత్‌లో చెలరేగిన మతహింసలకు దారి తీసిన పరిస్థితులపై కూడా దర్యాప్తు అవసరమని ఆమె పేర్కొన్నారు.

Mehabooba Mufthi slams BJP Over The Kashmir Files

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News