Wednesday, January 22, 2025

‘మెహ‌బూబా’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

MEHABUBA Video Song out from KGF 2

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కన్నడతో పాటు మిగతా సౌత్ భాషలు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో రన్ అవుతోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన పాటలు, నేప‌థ్య సంగీతం హైలెట్‌గా నిలిచాయి.  తాజాగా ఈ చిత్రంలోని ‘మెహ‌బూబా’ అనే రొమాంటిక్ మెలోడి సాంగ్ ఫుల్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఇందులో తన అందం, అభినయంతో శ్రీనిధి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, ఈ మూవీ బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల తరహాలోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ ఛాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన పార్ట్-2లో బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్‌తో పాటు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు.

MEHABUBA Video Song out from KGF 2
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News