Friday, December 27, 2024

మెహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ( పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి గురువారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం అనంత్‌నాగ్ జిల్లాలోని సంగం వద్ద ప్రమాదానికి గురయింది.ఖ నాబాల్‌లో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెహబూబా వాహనాన్ని మరో కారు ఢీకొనడంతో భద్రతా అధికారి గాయపడ్డారు.

కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో మెహబూబా సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె తన పర్యటనను కొనసాగించారు. తన తల్లి కారు ప్రమాదానికి గురయినట్లు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ పేర్కొన్నారు.భగవంతుడి దయవల్ల తన తల్లికి ఏమీ కాలేదని, భద్రతా సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ముఫ్తీ సురక్షితంగా ఉండడం పట్ల ట్విట్టర్‌లో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం కారణాలను నిర్ధారించుకోవడానికి దర్యాప్తు జరిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News