Monday, December 23, 2024

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మహబూబా ముఫ్తీ

- Advertisement -
- Advertisement -

అవంతిపోరా: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిపిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్ జిల్లాలో ‘భారత్ జోడో యాత్ర’ లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చెర్సూ గ్రామంలో ఓ రోజు బస చేశాక, తిరిగి శ్రీనగర్ వైపు శనివారం ఉదయం తన పాదయాత్రను కొనసాగించారు. అవంతిపోరా టౌన్‌లో మెహబూబా ముఫ్తీ తన కూతురు ఇల్తిజా ముఫ్తీతో కలిసి రాహుల్ గాంధీతో పాటు నడిచారు. కాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం పుల్వామా జిల్లాలోని లేత్‌పోరాలో నడిచారు. అయితే యాత్ర రూట్‌లో అధికారులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు.

‘మేము మూడంచెల రక్షణ ఇస్తున్నాము. అన్ని భద్రత ఏర్పాట్లు చేశాము. భారత్ జోడో యాత్ర స్మూత్‌గా సాగుతోంది. ట్రాఫిక్‌ను కూడా డైవర్ట్ చేశాము. ఎలాంటి సమస్య ఉండదు. నిన్న(శుక్రవారం) ఎలాంటి భద్రతా లోపం జరుగలేదు. చాలా మంది వాకేథాన్‌లో పాల్గొన్నారు’ అని కశ్మీర్ ఎజిడిజిపి విజయ్ కుమార్ తెలిపారు.

ఇదిలావుండగా భారత్ జోడో యాత్ర శనివారంనాడు శ్రీనగర్‌లోని పంథా చౌక దగ్గర ముగుస్తుందని, మళ్లీ ఆదివారం ఉదయం మొదలవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News