Sunday, December 22, 2024

మెహ్రూలీ కూల్చివేత: పోలీసులపై కారం చల్లిన మహిళలు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆక్రమణ వ్యతరేక డ్రైవ్‌లో మోహరించిన పోలీసు సిబ్బందిపై కారంపొడి చల్లారన్న ఆరోపణపై కొంత మంది మహిళా నిరసనకారులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మెహ్రూలీ ఆర్కియోలాజికల్ పార్క్ ప్రాంతంలో ఆక్రమణల నిరోధక డ్రైవ్‌ను శుక్రవారం మొదలెట్టారు. దాదాపు1200 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డిడిఎ) శనివారం తన ప్రకటనలో పేర్కొంది. స్థానిక నివాసితుల నుండి నిరసనలు, ఆప్, బిజెపి నినాదాల మధ్య, గట్టి పోలీసు భద్రత మధ్య డిడిఎ శుక్రవారం నుంచి ఈ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.

నిరసనకారులు ‘డిడిఎ హాయ్ హాయ్. తానాషాహి నహీ చలేగి, నహీ చలేగి’ అంటూ నినాదాలు చేశారు. ఈ కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకునేందుకు మహిళలు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు లాఠీ చార్జీ చేశారు. కానీ లాఠీ ఛార్జీ వంటివేవి జరపలేదని ఓ సీనియర అధికారి అన్నారు. నిరసనకారులు డిడిఎ సిబ్బందిని, పోలీసులను అడ్డుకున్నారని తెలిపారు. ‘కొంత మంది మహిళలు కారం పోలీసు సిబ్బంది మీద కారం చల్లారు. వారిలో కొందరిని నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని కూడా ఆ అధికారి చెప్పారు. డిడిఎ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను ఆదివారం కూడా కొనసాగించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News