Sunday, December 29, 2024

ఐఎఎస్తో మెహ్రీన్ మాజీ ప్రియుడి పెళ్లి

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మాజీ ప్రియుడు, హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, బిజెపి ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు. త్వరలోనే రాజస్థాన్ కు చెందిన పరి బిష్ణోయ్ అనే ఐఏఎస్ ను భవ్య బిష్ణోయ్ పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి జరగనుందట. పెళ్లి తర్వాత పుష్కర్, అదంపూర్, ఢిల్లీ నగరాల్లో 3 రిసెప్షన్స్ జరగనున్నాయి. ప్రస్తుతం భవ్య బిష్ణోయ్.. బిజెపి పార్టీ తరుపున అదంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా, 2021లో భవ్య బిష్ణోయ్ తో హీరోయిన్ మెహ్రీన్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత మెహ్రీన్ మళ్లీ తన సినీ కెరీర్ ను కొనసాగిస్తుంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News