Wednesday, January 22, 2025

మాజీ ప్రియురాలిపై అత్యాచారం.. కదులుతున్న కారులో నుంచి తోసేసి.. రోడ్డుపై అర్ధనగ్నంగా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: మాజీ ప్రియురాలిపై ప్రియుడు అత్యాచారం చేసి అనంతరం అర్ధ నగ్నంగా ఆమెను కదులుతున్న కారులో నుంచి తోసేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం మెహసానా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత ఆరు నెలల నుంచి అర్యన్ చావ్డా అనే వ్యక్తి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. చావ్డా అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో ఆమె అతడిని దూరం పెట్టింది. జూన్ 24న తనతో రావాలని మాజీ ప్రియురాలిని ప్రియుడు బతిమాలాడు. ఆమె ఒప్పుకోలేదు.

Also Read: పట్టపగలు నడిరోడ్డులో యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు… వీడియో వైరల్

దీంతో ఆమె ఒప్పించి తన కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేయడంతోపాటు దాడి చేశాడు. ఆమె జట్టును కట్ చేసి అర్ధనగ్నంగా కదలుతున్న కారులో నుంచి ఆమెను తోసేశాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరన్‌నగర్ రోడ్డులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News