Saturday, November 23, 2024

చోక్సీని రప్పించేందుకు ఇదే అదును..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పిఎన్‌బి స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని విచారణకు భారత్‌కు రప్పించవచ్చునని సిబిఐ మాజీ డైరెక్టర్ ఎపి సింగ్ తెలిపారు. డొమినికాలో ఆయన చోక్సీ పట్టుబడటం వల్ల అక్కడ ఆయనకు పౌరుడిగా ఎటువంటి హక్కులేనందున భారత్‌కు తరలించే క్రమాన్ని అడ్డుకునే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. అయితే చోక్సీ చాలా తెలివిగా వ్యవహరించి తనను కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకువచ్చారని కోర్టులో ఫిర్యాదు చేశారు. దీని విషయంలో ఆయన సరైన ఆధారాలు చూపగలిగితే భారత్‌కు ఆయన తరలింపును అక్కడి కోర్టులు అడ్డుకునే వీలుందని తెలిపారు. ఇప్పుడు ఆయన అంశం డొమినికా న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున ఆయన తరలింపు వ్యవహారంపై వారే నిర్ణయం తీసుకుంటారని సింగ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. చోక్సీని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ విమానాన్ని డొమినికాకు పంపించింది. అయితే తనను వేధించి గాయపర్చి స్పృహలేని స్థితిలో వేరే దేశం చేర్చారని, ఇదంతా కూడా భారతదేశపు దర్యాప్తు సంస్థల చర్యలలో భాగమే అని చోక్సీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.

Mehul Choksi can be deported to India: Ex CBI Director

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News