Thursday, January 23, 2025

గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: మేకపాటి

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: మాజీ మంత్రి, వైసిపి ఎంఎల్ఎ అనిల్‌కు వైసిపి నుంచి సస్పెండ్ అయిన ఎంఎల్ఎ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా గెలిచి చూపిస్తామని, గెలవకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాలు విసిరారు. నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని, సింగిల్ డిజిట్‌తో గెలిచిన నువ్వెక్కడా 35 వేల మెజార్టీతో గెలిచిన తానెక్కడా? అని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో తాను, ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News