Monday, December 23, 2024

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చేరుకున్న మేకపాటి పార్థీవ దేహం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: దివంగత మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం 06:50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వెళ్లారు.  ఉదయం 08:25 గంటలకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసం నుంచి మంత్రి మేకపాటి భౌతిక దేహం తరలించారు. ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తరలించారు.  మంత్రి మేకపాటి పార్థివ దేహం వెంట ప్రభుత్వం ఏర్పాటు చేసిన చాపర్ లో తల్లి మణిమంజరి, సతీమణి కీర్తి వెళ్ళారు. 11.15 గంటలకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్ కి చాపర్ చేరుకుంది. 11.25 గంటలకు డైకాస్ రోడ్డులోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి పార్థీవదేహం చేరుకుంది. మేకపాటి కుటుంబం 11.30 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్థివదేహాన్ని ఉంచారు.  ఇప్పటికే యూ.ఎస్ నుంచి బయలుదేరిన మంత్రి మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి రాత్రి 11గంటలకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది.  బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో సిఎం మంత్రి మేకపాటి భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించానున్నారు.  బుధవారం ఉదయం 11 గంటలకు ఉదయగిరి ప్రాంతంలో మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియలు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News