భర్తకు భార్య షరతు విధించింది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైతే తాను దేశ ప్రధమ పౌరురాలిగా ఉండనని మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆయన భార్య మెలానియా ట్రంప్ పెట్టిన కండిషన్ సంచలనం అయింది. ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ అయితే మెలానియా దేశానికి ఫస్ట్‌లేడీ కావాల్సి ఉంటుంది. ఇది శ్వేతసౌధం ద్వారా ఖరారైన విధివిధానం . అయితే తాను కుమారుడు బరాన్ ట్రంప్ కోసం మరింత సమయం కేటాయించాల్సి ఉంటుందని,
ఆయన నేత అయితే సంతోషమే కానీ తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని కూడా మిలానియా తెలిపారు. ఓ వైపు ట్రంప్ తన ప్రచారంలో దూకుడు పెంచుతున్న దశలోనే ఆమె ఆయనతో సంబంధిత విషయంలో డీల్ కుదుర్చుకుందని, ప్రచారంలో కూడా ఆమె పాల్గొనబోదని పేజీ 6లో వార్త వెలువడింది. ప్రెసిడెంట్ భార్యను అయితే విధిగా ఫస్ట్‌లేడీగా 24/7 డ్యూటీలో ఉండాల్సిందే , ఇది తనకు కుదరదని మెలానియా తేల్చివేసింది.