Monday, December 23, 2024

‘బిఆర్‌ఎస్’ నినాదాలతో మార్మోగిన స్టేడియం

- Advertisement -
- Advertisement -

Melbourne stadium was filled with chants of 'BRS'

మెల్‌బోర్న్ : కెసిఆర్ జిందాబాద్.. దేశ్‌కి నేత కెసిఆర్.. ఓట్ ఫర్ టిఆర్‌ఎస్ ఇన్ మునుగోడు.. అంటూ నినాదాలతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మార్మోగింది. టి20 ప్రపంచ కప్‌లో భాగంగా అదివారం భారత్‌పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నినాదాలు చోటు చేసుకున్నాయి. అధిక సంఖ్యలో టిఆర్‌ఎస్ అభిమానులు మద్దతు తెలిపారు. వీరంతా బిఆర్‌ఎస్ కెసిఆర్ ప్లకార్డులతో నినాదాలు చేశారు. పివి విగ్రహం ఆవిష్కరణకు ఆస్ట్రేలియా విచ్చేసిన టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని రోజు రోజుకూ మద్దతు పెరుగుతుందని, ఎన్‌ఆర్‌ఐలతో పాటు దేశ ప్రజలంతా కెసిఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాలలో త్వరలోనే కేసిఆర్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. మునుగోడులో టిఆర్‌ఎస్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాగేందర్‌రెడ్డి కోరారు. వారి వెంట టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా నాయకులు డా. అనిల్‌రావు, వినయ్ సన్నీగౌడ్, విక్రమ్ కందుల, నరేందర్‌రెడ్డి, సాయి గుప్తా, విశ్వామిత్ర, సనిల్‌రెడ్డి, సతీశ్ పులిపకల తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News