Friday, December 20, 2024

మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా సేనలు..

- Advertisement -
- Advertisement -

కీవ్: దక్షిణ ఉక్రెయిన్ లోని మెలిటొపోల్‌ను అధీనంలోకి తీసుకున్న రష్యా సైనికులు శుక్రవారం ఆ నగరమేయర్‌ను కిడ్నాప్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఆయుధాలతో వచ్చిన కొంతమంది మెలిటొపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్ కిరిల్ తిమోషెండో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శత్రు సైనికులకు సహకరించటల్లేదని ఆయనను అపహరించినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఈ చర్యలు ఐసీస్ ఉగ్రవాదుల కంటే తక్కువేం కాదు.” అని జెలెన్‌స్కీ మండిపడ్డారు. మెలిటొపోల్ నగరాన్ని ఫిబ్రవరి 26నే రష్యా కైవసం చేసుకుంది.

 Melitopol Mayor Kidnapped by Russia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News